సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

న్యూఢిల్లీలో నేడూ ఆంక్షలు; ఆరు మెట్రో స్టేషన్లు బంద్: డీఎంఆర్సీ

55 నిమిషాల క్రితం

ఢిల్లీలో కేంద్ర బలగాల అణచివేతకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతున్న వేళ, దేశ రాజధానిలో నేడు కూడా కఠినమైన ఆంక్షలు కొనసాగనున్నాయి.

ఢిల్లీలో కేంద్ర బలగాల అణచివేతకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతున్న వేళ, దేశ రాజధానిలో నేడు కూడా కఠినమైన ఆంక్షలు కొనసాగనున్నాయి.

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 08:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ:

ఢిల్లీలో కేంద్ర బలగాల అణచివేతకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతున్న వేళ, దేశ రాజధానిలో నేడు కూడా కఠినమైన ఆంక్షలు కొనసాగనున్నాయి. మొత్తం ఆరు మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ప్రకటించింది.


సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలిగించకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ, ఆంక్షలు మరింత కఠినతరం చేయడం గమనార్హం. సుప్రీంకోర్టు వైపు విపక్షాలు నేడు మార్చ్ నిర్వహించనున్న తరుణంలో ఈ ఆంక్షలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు, ఈ ఆరు మెట్రో స్టేషన్లలోనూ ఇంటర్‌చేంజ్ (మరో రూట్‌కు మారే) సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని డీఎంఆర్సీ స్పష్టం చేసింది.


మూసివేసిన మెట్రో స్టేషన్లు ఇవే:


* రాజీవ్ చౌక్

* పటేల్ చౌక్

* సెంట్రల్ సెక్రటేరియట్

* మండి హౌస్

* జన్ పథ్

* బారాఖంబా రోడ్



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్