బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబల్గేరియా అధ్యక్ష‍ులుగా యొటోవా

1 రోజు క్రితం

​
బల్గేరియా తొలి అధ్యక్షరాలుగా ఎన్నికైన యొటోవా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 11:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సోఫియా: బల్గేరియా అధ్యక్ష ఎన్నికల్లో 62ఏళ్ల ఇలియానా యొటోవా విజయం సాధించారు. ప్రోగ్రెసివ్ బల్గేరియా పార్టీ తరపున పోటీ చేసిన ఆమెకు దాదాపు 58.2 శాతం ఓట్లు వచ్చాయి. బల్గేరియా చరిత్రలో ఎన్నికైన తొలి మహిళా దేశాధినేతగా యొటోవా రికార్డు నెలకొల్పారు. ప్రధానమంత్రి రుమెన్ రాదేవ్ కూడా ఇలియానాకు మద్దతు తెలిపారు. యొటోవాపై పోటీ చేసిన ఆండ్రే గ్యూరోవ్‌కు 39.6శాతం ఓట్లు వచ్చాయని ఆదేశ మీడియా నివేదించింది. అయితే, ఉక్రెయిన్‌ ‌యుద్ధం ఈ ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. ఇలియానా రష్యాతో చర్చల జరిపి శాంతియుత పరిష్కారం కోసం కృషి చేస్తానని ప్రచారం చేశారు. అంతేకాకుండా ఉద్రిక్తతలు తగ్గించేందుకు పాశ్యాత్య దేశాలతో మరింత సన్నిహిత సంబంధాలు నెలకొల్పుతామని ఆమె పేర్కొన్నారు. బల్గేరియా నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై డ్రోన్‌ ‌దాడులు పేరిగాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో యూరప్‌తో బల్గేరియా సంబంధాలను కొనసాగిస్తూనే, రష్యాతో మెరుగైన సంబంధాలకు మద్దతు ఇచ్చే రాదేవ్‌ విధానాన్ని ఇలియానా కొనసాగిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్