- అమెరికా టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ : విదేశాల్లో ఎఐ డేటా కేంద్రాలను నిర్మించే దేశీయ టెక్ కంపెనీలపై భారీగా జరిమానాలు, పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆసియా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమెరికా కంపెనీలు ఇతర దేశాల్లో డేటా సెంటర్లను నిర్మించడానికి తమ ప్రభుత్వం అనుమతించబోదని స్పష్టం చేశారు. డేటా సెంటర్లను ఇతర దేశాలకు తరలిస్తే వాటన్నింటినీ చైనా స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉన్నదని ఆరోపించారు. గతంలో సెమీ కండక్టర్ చిప్స్, ఇతర సాంకేతికతలను విదేశాలకు అనుమతించడం వల్ల అమెరికా తీవ్రంగా నష్ట పోయిందని చెప్పారు. టెక్ దిగ్గజాలు అమెరికా లోనే డేటా సెంటర్లను నిర్మించాలని స్పష్టం చేసిన ట్రంప్.. .అందుకు సిద్ధపడే కంపెనీలకు స్థానికంగా సహకరించాలని, వాటి నుంచి కమ్యూనిటీ అభివృద్ధికి నిధులు, రాయితీలు రాబట్టుకోవాలే తప్ప ప్రాజెక్టులను అడ్డుకోవద్దని కోరారు. గూగుల్, మెటా వంటి దిగ్గజ అమెరికా టెక్ కంపెనీలు ఇప్పటికే విదేశాల్లో డేటా సెంటర్ల నిర్మాణానికి ఒప్పందాలు చేసుకున్నాయి. అమెరికాలో డేటా సెంటర్ల నిర్మాణం కారణంగా విద్యుత్ బిల్లులు పెరుగు తున్నాయని, పర్యావరణానికి నష్టం వాటిల్లుతోం దని స్థానిక ప్రజలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.







కామెంట్‌లు (0)