శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు అస్వస్థత

2 గంటల క్రితం

csas
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 12:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బ్రసిలా : ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకి అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి ఉదర భాగం ఉబ్బడం వంటి సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వైద్యవర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం బోల్సోనారోకు నొప్పి నివారణ మందులు ఇస్తున్నామని, శస్త్రచికిత్స వంటి కఠినమైన ప్రక్రియలు అవసరం లేకుండానే ఈ సమస్యను నయం చేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని ఆయన కుమారుడు కార్లోస్ బోల్సోనారో ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. బోల్సోనారో, 2022 ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తిరుగుబాటుకు కుట్ర పన్నినందుకు గత ఏడాది నుంచి 27 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా మానవతా దృక్పథంతో గృహ నిర్బంధంలో ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్