శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవంటకు మనసు రుచి!

1 గంట క్రితం

cooking
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 05:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

వంట చేయడం సాధారణ విషయం కాదు. ఉప్పు, కారం.. వగైరా ఉంటేనే వంట రుచిగా రాదు. వండేటప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. కోపంగా ఉన్నప్పుడు అసలు వంట చేయకూడదు. ఇవన్నీ మామూలుగా చెబుతున్న మాటలు కాదు. ‘కోపంతో వంట చేస్తే ముందు వంటపై, ఆ తరువాత తిన్నవారిపై ఆ ప్రభావం పడుతుందని’ ప్రముఖ పాకశాస్త్ర రచయిత, మాజీ చెఫ్ సుజామ్ ఓరెల్ అంటున్నారు. 'బట్ ఫస్ట్, బ్రేక్‌ఫాస్ట్' పేరిట ఆమె పాకశాస్త్రం గురించి రచనలు చేస్తుంటారు. తాజాగా ఆమె ఈ విషయంపై చర్చించారు.

తీవ్రమైన కోపం లేదా ఆవేశంతో ఉన్నప్పుడు చేసే వంటకు చాలా ఘాటైన రుచి వస్తుంది అంటారు ఆమె. కోపంలో ఎలా భావిస్తామో... అలాగే వంట కూడా ఆ భావనను ప్రతిబింబిస్తుంది అని సుజామ్ చెబుతున్నారు. కోపంతో ఉన్నప్పుడు వంటగదిలో కత్తులు, వేడి పెనాలు పట్టుకోవడం చాలా ప్రమాదమని కూడా ఆమె హెచ్చరిస్తున్నారు.

అమ్మ చేసే వంట పిల్లలకు చాలా రుచిగా అనిపిస్తుంది. పెద్దయ్యాక కూడా ఆ రుచిని మర్చిపోరు. చాలా సందర్భాల్లో 'మా అమ్మ ఫలానా కూర, వంటకం భలే రుచిగా చేస్తుంది' అని అనేకమంది అంటుంటారు. దీనికి కారణం.. అమ్మ పిల్లలకు వండి పెట్టేటప్పుడు ఎంతో శ్రద్ధగా వంట చేస్తుంది. పిల్లలు రుచిగా తినాలని మనసంతా దానిపై పెడుతుంది. అందుకే అది ఎంతో కమ్మగా ఉంటుంది. ఆ రుచి మళ్లీ మళ్లీ తినాలనిపించేంతగా ఉండడం వెనుక అమ్మ మనసు ఆ సమయంలో ఎంతో ప్రశాంతంగా ఉండడం. అదే 'అమ్మ కోపంగా ఉన్నప్పుడు చేసిన వంట ఏ పిల్లలకూ పెద్దగా గుర్తుండదు. అసలు దాని గురించి వారు ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. మనం పెద్దయ్యాక కూడా అమ్మ వండిన వంటకం గుర్తుంది అంటే దాని అర్థం అమ్మ ఆ వంటను కోపంగా లేనప్పుడు చేసింది' అంటారు సుజామ్.

'వండడం ఒక్కటే కాదు.. తినడం కూడా చాలా శ్రద్ధతో చేయాల్సిన పని' అంటున్నారు సుజామ్. 'నిర్లక్ష్యంగా, యాంత్రికంగా, అతిగా ఎప్పుడూ తినకూడదు. తినే ఆహారం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా పోషణ ఇవ్వాలి. అలా కావాలంటే భోజనం చేసేటప్పుడు ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి. హడావిడి తిండి అసలు పనికిరాదు' అంటారు ఆమె.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్