శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేడు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

1 గంట క్రితం

rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 06:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విపత్తుల నిర్వహణ సంస్థ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో శుక్రవారం మేఘవృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తరాంధ్ర, బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఎస్‌‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ‌వైఎస్‌ఆర్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ప్రఖర్ జైన్ ‌గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని తెలిపారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్