శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వచ్చే వారంలో నాటో నేతల భేటీ

3 గంటల క్రితం

nato
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 10:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రక్షణ వ్యయం పెంపు, అమెరికాతో విభేధాలపై దృష్టి

అంకరా : టర్కీ రాజధాని అంకరాలో వచ్చే వారంలో నాటో దేశాల నాయకులు సమావేశం కానున్నారు. ఈ నెల 7,8 తేదీల్లో జరగనున్న నాటో దేశాల శిఖర్రాగ సదస్సుకు టర్కీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశంలో రక్షణ వ్యయాన్ని పెంచుకోవడం, అమెరికాతో విభేదాలపైనే నాటో దేశాల నాయకులు ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో అనేక బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే శుక్రవారం వెల్లడించారు. జర్మనీలోని బెర్లిన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రష్యాను నిలువరించడానికి రక్షణ వ్యయాన్ని పెంచడానికి నాటో దేశాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. టర్కీ అధ్యక్షులు ఎర్డోగాన్ ఇచ్చే విందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌స్కీ హాజరవుతారు. ఈ సందర్భంగా ఎర్డోగాన్, ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. నాటోకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ ‌వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఈ సదస్సు జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాటోకు అమెరికా మద్దతును కొనసాగించడం 'హాస్యాస్పదం' అని ట్రంప్ కొన్ని రోజుల క్రితం తన ‘ట్రూత్‌’లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్