శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్యాటర్లపైనే భారం

1 గంట క్రితం

team india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 12:53 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

నేడు భారత్‌, ఇంగ్లండ్‌ ‌జట్ల మధ్య రెండో టి20 రాత్రి 7.00గం.లకు

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌‌తో జరిగే ఐదు టి20ల సిరీస్‌‌లో భాగంగా రెండో టి20 మాంచెస్టర్‌ ‌వేదికగా శనివారం జరగనుంది. తొలి టి20 వర్షం కారణంగా రద్దు కావడంతో.. ఈ మ్యాచ్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. సిరీస్‌‌లో ఆధిక్యత సంపాదించాలంటే ఇరుజట్లకు గెలుపు తప్పనిసరి. తొలి టి20లో టీమిండియా 189 పరుగుల భారీ స్కోర్‌ ‌సాధించినా.. అనంతరం వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ ‌రద్దయ్యింది. దీంతో ఆ టి20 ఫలితం తేలకుండానే రద్దయింది. అభిషేక్‌ ‌శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌ అర్దసెంచరీలకి తోడు దూబే బ్యాటింగ్‌‌లో రాణించాడు. సంజు శాంసన్‌, తిలక్‌ ‌వర్మ, ఇషాన్‌ ‌కిషన్‌ బ్యాటింగ్‌‌లో నిరాశపరచడంతో యువ క్రికెటర్‌ వైభవ్‌ ‌సూర్యవంశీని తుది జట్టులో చోటు కల్పించా లంటూ మాజీ క్రికెటర్లు టీమిండియా మేనేజ్‌‌ మెంట్‌‌కు సూచన చేశారు. ఈ క్రమంలో సూర్యవంశీకి చోటు దక్కుతుందా? లేదా అనే సందేశం అందరి నెలకొంది.

వన్డే సిరీస్‌లకు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన

టి20 ఫార్మాట్‌ ‌ముగిసిన తర్వాత భారత్‌‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌‌కు ఇంగ్లండ్‌ ‌జట్టును ఆ దేశ క్రికెట్‌ ‌బోర్డు శుక్రవారం ప్రకటించింది. దాదాపు ఏడాది క్రితం తర్వాత వన్డేల్లో జోఫ్రా ఆర్చర్‌‌కు చోటు దక్కింది. అలాగే సస్సెక్స్ ఆల్‌రౌండర్ జేమ్స్ కొల్స్‌ సైతం తొలిసారి వన్డే జెర్సీ వేసుకోనున్నాడు. సొంతగడ్డపై భారత్‌తో మూడు వన్డే సిరీస్‌కు శుక్రవారం ఇంగ్లండ్, వేల్స్ బోర్డు(ECB) ప్రకటించిన స్క్వాడ్‌ను ఆర్చర్, జేమ్స్‌ ఇద్దరికీ చోటు దక్కింది. హ్యారీ బ్రూక్ సారథ్యంలో పూర్తి స్థాయిలో వన్డే పగ్గాలు అప్పగిస్తూ 16 మందితో కూడిన బృందాన్ని ఈసీబీ ఎంపిక చేసింది. స్వదేశంలో భారత జట్టుతో టీ20 సిరీస్ అనంతరం మొదలయ్యే వన్డే సమరంతోనే స్క్వాడ్‌ను పటిష్టం చేసుకోవాలని భావించిన ఈసీబీ.. శుక్రవారం వన్డే బృందాన్ని ప్రకటించింది. వీరితోపాటు శ్రీలంక పర్యటనకు దూరమైన పేసర్లు అట్కిన్సన్, మహమూద్‌లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అలాగే ఓపెనర్ జాక్ క్రాలే, పేసర్లు జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, ల్యూక్ వుడ్‌లను తప్పించి.. వీరి స్థానంలో ఆర్చర్, అట్కిన్సన్, సకీబ్, కోల్స్‌ను తీసుకుంది.2027లో దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్‌కప్ లక్ష్యంగా స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 14 నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలవ్వనుంది. తొలి వన్డే ఎడ్జ్‌బాస్టన్‌లో.. రెండోది కార్డిఫ్‌లో జూలై 16న, మూడోది లార్డ్స్‌లో జూలై19న జరగనున్నాయి.

వన్డేలకు ఇంగ్లండ్ జట్టు : హ్యారీ బ్రూక్‌(కెప్టెన్), డకెట్, బట్లర్, బెథెల్, రూట్, బ్యాంటన్, విల్ జాక్స్, జేమ్స్ కొలెస్, సామ్ కరన్, డాసన్, రషీద్, మహమూద్, రెహాన్ అహ్మద్, ఆర్చర్, అట్కిన్సన్, ఆర్చర్, జోష్‌ టంగ్.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్