mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఒరిస్సాలో పెరుగుతున్న మూక దాడులు !

4 గంటల క్రితం

kerala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 11:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కేరళం కార్మికుడిపై దాడి

భువనేశ్వర్‌ : పిల్లాడిని ఎత్తుకెళుతున్నాడనే అనుమానంతో దినసరి వేతన కూలీపై మూక దాడి జరిగిన ఘటన పశ్చిమ ఒరిస్సాలోని సంబాల్‌‌పూర్‌‌లో చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితమే రాయగఢ జిల్లాలో కూడా ఇదే తరహా సంఘటన జరిగింది. పిల్లలను ఎత్తుకెళుతున్నారనే అనుమానంతో ఇద్దరు ఎన్‌‌జిఓ వర్కర్లపై గ్రామస్తులు దాడి చేశారు. కేరళంలోని అలప్పూజకు చెందిన ఎస్‌ విష్ణు అనే వ్యక్తి సంభాల్‌‌పూర్‌‌లో దొహపడా పార్కుకు సమీపంలో తిరుగుతుండగా స్థానికులు అతడిని అడ్డుకుని ప్రశ్నించారు. వెంటనే ఒడియా భాషలో ఆ వ్యక్తి సమాధానం ఇవ్వలేకపోవడంతో పిల్లలను ఎత్తుకెళ్ళే వ్యక్తిగా అనుమానించి, ఒక్కసారిగా అతనిపై మూక దాడికి దిగారని పోలీసులు తెలిపారు. ఆ దాడి నుండి కాపాడి ఆ వ్యక్తిని పోలీసులు అస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత విష్ణు స్నేహితుడితో, కుటుంబంతో మాట్లాడిన అనంతరం అక్కడ నుండి రైల్లో ఎక్కించి పంపివేసినట్లు పోలీసులు తెలిపారు. ఒరిస్సాలో ఇటీవల కాలంలో ఇలాంటి మూక దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఒరిస్సాలో ఒక ఎన్‌‌జిఓలో ఇంటర్న్‌‌షిప్‌ ‌చేస్తున్న ఢిల్లీకి చెందిన బాలిక, గుజరాత్‌‌కు చెందిన బాలుడిని ఈ నెల 16న గ్రామస్తులు కిడ్నాప్‌ ‌చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. కల్యాణ్‌‌సింగ్‌‌పూర్‌ ‌పోలీసు స్టేషన్‌ ‌పరిధిలోని గ్రామస్తులు దాదాపు వందమంది ఈ దాడికి దిగారు. ఇప్పటివరకు ఈ కేసులో 25మందినిఅరెస్టు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్