శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బాలయ్య అభిమానిగా...

1 గంట క్రితం

jaya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 08:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీవిష్ణు నటిస్తోన్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. రచయిత కోన వెంకట్ సమర్పణలో, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో రాధిక ‘సరస్వతమ్మ’ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర ‘నందమూరి బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్’గా ఉండనుంది. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1992లో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పూర్తిస్థాయి వినోదభరితంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్