శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బిఎస్‌ఇ రూ.30 వేల కోట్ల విలువ ఆవిరి

1 గంట క్రితం

bse
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 09:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : గత రెండేళ్లుగా స్టాక్‌ మార్కెట్‌లో మెరుగైన పనితీరు కనబరిచిన బిఎస్‌ఇ షేరు ప్రస్తుతం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గత మూడు నెలల్లో కంపెనీ మార్కెట్‌ విలువ దాదాపు రూ.30 వేల కోట్లు కోల్పోయింది. క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ అమలు, సెన్సెక్స్‌ ఆప్షన్ల ట్రేడింగ్‌ పరిమాణం తగ్గడం, బ్రోకర్లకు బ్యాంకు గ్యారెంటీ నిబంధనలు కఠినతరం కావడం వంటి పరిణామాలు షేరుపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో పలు బ్రోకరేజీ సంస్థలు కంపెనీ ఆదాయ అంచనాలను తగ్గించి, షేరుపై అండర్‌పర్ఫామ్‌, హోల్డ్‌ వంటి రేటింగ్‌లను కొనసాగిస్తున్నాయి. బిఎస్‌ఇ సగటు రోజువారీ ప్రీమియం టర్నోవర్‌ రూ.18,100 కోట్లకు తగ్గగా, కాంట్రాక్టుల సంఖ్య 15 కోట్ల నుంచి 10.4 కోట్లకు పడిపోయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్