బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దర్శకుడు పవన్ సాధినేనిని అరెస్ట్‌

1 గంట క్రితం

pavan sadineni
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 10:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడంటూ ఓ సినీ నటి ఇచ్చిన ఫిర్యాదుతో టాలీవుడ్ దర్శకుడు పవన్ సాధినేనిని గోల్కొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పవన్ రిమాండ్‌లో ఉన్నారు. పవన్ సాధినేని తనను ప్రేమ పేరుతో నమ్మించాడని బాధిత నటి ఆరోపించారు. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, చాలాకాలం పాటు తనతో సహజీవనం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి మొహం చాటేశాడని పోలీసులకు తెలిపారు. బాధితురాలి ఆరోపణల మేరకు గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి, పవన్ ని అరెస్ట్ చేశారు.
'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు పవన్ సాదినేని. ఆ తర్వాత 'సావిత్రి', 'సేనాపతి' లాంటి చిత్రాలతో పాటుగా 'కమిట్మెంటల్' వంటి హిట్ వెబ్ సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా 'ఆకాశంలో ఒక తార' అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతలోనే పవన్ సాదినేని ఇలా వివాదంలో చిక్కుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్