బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionDuleep Trophy : సెమీస్‌‌కు నార్త్‌‌జోన్‌

1 గంట క్రితం

duleep trophy.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 11:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ‌దులీప్‌ ‌ట్రోఫీ క్వార్టర్‌ ‌ఫైనల్‌

బెంగళూరు : దులీప్‌ ‌ట్రోపీ క్వార్టర్‌ ‌ఫైనల్లోకి నార్త్‌‌జోన్‌ ‌జట్టు దూసుకెళ్లింది. రెండో ఇన్నింగ్స్‌‌లో వెస్ట్‌‌జోన్‌‌పై 52పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవర్‌‌నైట్‌ ‌స్కోర్‌ 7వికెట్ల నష్టానికి 220 పరుగులతో బుధవారం నాల్గోరోజు ఆటను కొనసాగించిన వెస్ట్‌‌జోన్‌‌ మర్ 14 పోరుగులు జతచేసి చివరి 3వికెట్లు కోల్పోయింది. దీంతో వెస్ట్‌‌జోన్‌ ‌జట్టు రెండో ఇన్నింగ్స్‌‌లో 234పరుగులకు ఆలౌట్టయ్యింది. కెప్టెన్‌ ‌గైక్వాడ్‌(66) అర్ధసెంచరీకి తోడు ఉర్విల్‌(25) మాత్రమే బ్యాటింగ్‌‌లో రాణించగా.. లోయర్‌ ఆర్డర్‌‌ బ్యాటర్లంతా సింగిల్‌ ‌డిజిట్‌‌కే పరిమితమయ్యారు. వెస్ట్‌‌జోన్‌ ఇన్నింగ్స్‌ ‌నాల్గోరోజు కేవలం 28 నిమిషాల్లోనే ముగిసింది. నార్త్‌‌జోన్‌ ‌బౌలర్లు అబిద్‌ ‌ముస్తాక్‌‌కు నాలుగు, నిషాంత్‌ సింధుకు రెండు, ఆర్ష్‌‌దీప్‌, కంబోజ్‌, సునీల్‌‌కు ఒక్కో వికెట్‌ ‌దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌ అబిద్‌ ‌ముస్తాక్‌‌కు లభించింది. ఆదివారం 30నుంచి సెమీఫైనల్స్‌ జరగనున్నాయి.

స్కోర్లు...

నార్త్‌జోన్‌ : 251, 222 ‌

వెస్ట్‌‌జోన్‌ : 187, 234


సెమీఫైనల్స్‌ :

సెంట్రల్‌ ‌జోన్‌ × ఈస్ట్‌‌జోన్‌సౌత్‌ ‌జోన్‌ × ‌నార్త్‌ ‌జోన్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్