హైదరాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ) నుంచి ప్రయాణించే విమాన ప్రయాణికులకు, విమానయాన సంస్థలకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. విమానాశ్రయ ఆర్థిక నియంత్రణ సంస్థ (ఎరా) నిర్ణయించిన సవరించిన ఏరోనాటికల్ టారిఫ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ వెల్లడించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు ఉండే ఐదేళ్ల నియంత్రణ కాలానికి ఈ నూతన ఫీజులు వర్తిస్తాయి. తాజా సవరణల ప్రకారం ప్రయాణికులపై యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (యుడిఎఫ్) సెప్టెంబర్ 1 నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరే దేశీయ ప్రయాణికులు రూ. 515, అంతర్జాతీయ ప్రయాణికులు రూ. 1,030 చొప్పున యుడిఎఫ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుములు ప్రతి ఏటా క్రమంగా పెరుగుతూ 2029 అక్టోబర్ నాటికి దేశీయ ప్రయాణికులకు రూ. 670, అంతర్జాతీయ ప్రయాణికులకు రూ. 1,175కు చేరనున్నాయి. ప్రయాణికుల ఫీజులతో పాటు విమానాల ల్యాండింగ్ చార్జీలు కూడా పెరగనున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు దేశీయ విమానాలకు మెట్రిక్ టన్నుకు రూ. 435, అంతర్జాతీయ విమానాలకు రూ. 630గా ల్యాండింగ్ ఫీజు నిర్ణయించారు. ఇవి కూడా 2029 అక్టోబర్ నాటికి క్రమంగా పెరుగుతూ దేశీయ విమానాలకు రూ.745, అంతర్జాతీయ విమానాలకు రూ. 905 వరకు చేరుకుంటాయి.
Print Editionహైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ విమాన ఛార్జీల్లో మార్పులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 26, 2026, 09:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)