శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

3న ఓటీటీలో ‘గాంధారి’

1 గంట క్రితం

gandhari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 08:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధారి’ చిత్రం సెప్టెంబర్‌ 3న నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా స్ట్రీమింగ్‌ కానుంది. దేవాశిష్‌ మఖిజా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను కనికా థిల్లాన్‌ నిర్మించారు. ‘జాయ్‌పుర్రా’ అనే కల్పిత నగరం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తాప్సీ ‘బానీ’ అనే ధైర్యవంతురాలైన తల్లి పాత్రలో కనిపించనున్నారు. తన కుమార్తెను కాపాడుకునేందుకు ఆమె చేసే పోరాటం, ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్ల చుట్టూ కథ సాగుతుంది. ఇష్వాక్‌ సింగ్‌, ఛాయా కదమ్‌, స్వస్తిక ముఖర్జీ, మీతా వశిష్ఠ్‌, జతిన్‌ సర్నా కీలక పాత్రల్లో నటించారు. తాప్సీ, కనికా థిల్లాన్‌ కలయికలో వస్తున్న మూడో చిత్రమిది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్