గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్టోబర్ 23న ‘హైకూ’

1 గంట క్రితం

hykiy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 07:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘కోర్టు’, ‘బ్యాండ్ మేళం’ చిత్రాలతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీదేవి తమిళ చిత్రం ‘హైకూ’లో నటిస్తోంది. ఏగన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం తాజాగా గ్లింప్స్‌ ద్వారా ప్రకటించింది. ‘అంతా ప్రేమ గురించే.. హైకూ అద్భుతమైన ప్రపంచాన్ని అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా మీ ముందుకు తెస్తున్నాం’ అంటూ మేకర్స్‌ విడుదల తేదీని వెల్లడించారు. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువరాజ్‌ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ్‌, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్