గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రవిమోహన్‌ వెంకటేశ్వరస్వామిగా...

1 గంట క్రితం

movies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 07:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హీరో మంచు మనోజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వడ్డీకాసుల వాడ’. ఈ చిత్రంలో కోలీవుడ్‌ నటుడు రవిమోహన్‌ వెంకటేశ్వరస్వామి పాత్రలో కనిపించనున్నారు. గురువారం (సెప్టెంబర్‌ 10) రవిమోహన్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ‘మన ప్రియమైన రవిమోహన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి హృదయంలోనూ కొలువై ఉండే శ్రీ గోవిందుని దివ్య పాత్రలో మిమ్మల్ని ‘వడ్డీకాసుల వాడ’ చిత్రంలోకి ఆహ్వానించడం మా అదృష్టం. ముందున్న ఈ ప్రత్యేక ప్రయాణం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. ఓం నమో వేంకటేశాయ’ అంటూ చిత్రబృందం పోస్టర్‌ను పంచుకుంది. ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్