గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘చకోర’ నుంచి ‘ధమ్ ధమ్’

1 గంట క్రితం

song
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 07:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘చకోర లూనార్ లవ్ బర్డ్’. ఈ చిత్రం అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ధమ్ ధమ్’ అనే లిరికల్ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాశ్ విడుదల చేశారు. ఈ పాట శ్రోతలను ఆకట్టుకోవడంతో పాటు మూత్‌కు బాగా కనెక్ట్ అవుతుందని ఆయన అన్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను నూతన గాయని అభిఖ్య తనికెళ్ల ఆలపించారు. మెహర్ బాబా కొరియోగ్రఫీ అందించారు. హై జాయ్ కమర్షియల్ బ్యానర్‌పై డా. చింతాడ హేమారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు మంగా శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్