సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

హుషారు పిట్టలు ట్రైలర్‌ విడుదల

1 గంట క్రితం

daggupati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 07:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అన్షు, వాసవి గణేశన్‌ జంటగా నటించిన ‘హుషార్‌ పిట్టలు’ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర ట్రైలర్‌ను నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ, ఎంతో అంకితభావంతో ఈ చిత్రాన్ని రూపొందించారని, తమ ప్రతినిధులు సినిమాను చూసి సానుకూలంగా స్పందించడంతో ‘సురేష్‌ ఏషియన్‌ ఫిల్మ్స్‌’ ద్వారా విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రేక్షకుల సమయానికి, డబ్బుకు విలువనిచ్చే చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్‌ యాదవ్‌ నిర్మించారు. చరణ్‌ అర్జున్‌ సంగీతం అందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్