సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కిరణ్ అబ్బవరం ‘ఇంద్రపుత్ర’

1 గంట క్రితం

abburi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 07:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో ‘ఇంద్రపుత్ర’ పేరుతో పాన్ ఇండియా మైథాలజీ చిత్రం తెరకెక్కనుంది. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘కెఎ 15’గా తెరకెక్కనున్న ఈ సినిమాను ‘ఇంద్రపుత్ర: ఫస్ట్ ఛాప్టర్’గా ప్రకటించారు. మన పురాణ ఇతిహాసాల్లోని ధర్మం, అధర్మం మధ్య పోరాటం ఆధారంగా మైథాలజీ, యాక్షన్, ఫాంటసీ, ఎమోషన్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కిరణ్ అబ్బవరం ఇందులో సరికొత్త అవతార్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబర్‌ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కీర్తన్ కథ అందించడంతోపాటు కుస్సుమ్ అరోరాతో కలిసి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తన్వీ ఎన్. దత్త స్క్రిప్ట్ అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్