జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఓఎంజీ పిక్చర్స్ సొంతం చేసుకుంది. పూర్వాజ్ రచన, దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా తదితర ప్రాంతాల్లో విడుదల కానుంది. ఉర్వీష్ పూర్వజ్ సమర్పణలో థింక్ సినిమా బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో సైన్స్ ఫిక్షన్, మిస్టరీ, యాక్షన్, థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా అంశాలను మేళవించారు. మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కుతున్న ‘కిల్లర్’లో జ్యోతి పూర్వజ్ రానియా, రక్తిక, జూలియా, సియా తదితర విభిన్న ఛాయలున్న పాత్రల్లో కనిపించనున్నారు. కృత్రిమ మేధ ఆధారిత అవతార్‌లోనూ ఆమె కనిపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఓఎంజీ పిక్చర్స్‌కు ‘కిల్లర్’ ఓవర్సీస్ హక్కులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 07:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)