శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాడీ షేమింగ్‌పై స్పందించిన కత్రినా

1 గంట క్రితం

katrina
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 07:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తనపై జరుగుతున్న బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ స్పందించారు. ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అందమంటే ఇలానే ఉండాలని, కొలతలేనని భావించేదాన్ని. తర్వాత రానురాను అందంపై నా దృక్పథం మారిపోయింది. ఇప్పుడు నా దృష్టిలో అందంగా ఉండటం అంటే మనకి మనం ఉన్నతంగా కనిపించడం. ఆరోగ్యంగా ఉంటూ.. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడమే అందం. పైకి కనిపించేది అందం కాదు.. మనం ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నామనేది ముఖ్యం’ అని ఆమె అన్నారు. కత్రినా కైఫ్‌ తల్లైన తర్వాత లావయ్యారు. ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన వినాయకచవితి వేడుకల్లో ఆమె పాల్గొన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఫొటోల్లో ఆమె లావుగా కనిపించడంతో బాడీ షేమింగ్‌పై విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యారు. ఆమెకు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు నిలబడ్డారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్