మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రేమబంధంలో కావ్య, కాల భైరవ

16 గంటల క్రితం

love
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 06:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సంగీత దర్శకుడు కాల భైరవ, నటి కావ్య కల్యాణ్‌రామ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. జీవితాంతం ఒకరికొకరం తోడూనీడగా ఉంటామని ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని కాల భైరవ తెలిపారు. ఎం.ఎం. కీరవాణి తనయుడైన కాల భైరవ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన కావ్య ‘మసూద’, ‘బలగం’ చిత్రాలతో నటిగా పేరు సంపాదించారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. వీరికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్