బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కిచ్చా సుదీప్‌ ‘బిల్లా రంగ బాషా: ఫస్ట్‌ బ్లడ్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

1 గంట క్రితం

brb
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 11:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- కిచ్చా సుదీప్‌ పుట్టినరోజు సందర్భంగా

హైదరాబాద్‌: కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రతిష్ఠాత్మక సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ మూవీ ‘బిల్లా రంగ బాషా: ఫస్ట్‌ బ్లడ్‌’ ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇప్పటివరకు సుదీప్‌ కెరీర్‌లో చూడని విధమైన భారీ ప్రపంచాన్ని ఈ పోస్టర్‌ పరిచయం చేస్తోంది. మంచుతో కప్పబడిన ప్రాంతం, చుట్టూ విధ్వంసం, ఆకాశంలో విమానాలు, యుద్ధ యంత్రాల మధ్య బైక్‌పై సుదీప్‌ కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. గాగుల్స్‌, రఫ్‌ లుక్‌, సీరియస్‌ ఎక్స్‌ప్రెషన్‌తో ఆయన మాస్‌ అవతార్‌లో దర్శనమిచ్చారు.

‘విక్రాంత్‌ రోణ’తో ప్రత్యేకమైన ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించిన అనూప్‌ భండారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘బిల్లా రంగ బాషా: ఫస్ట్‌ బ్లడ్‌’ను భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సుదీప్‌, అనూప్‌ భండారి కాంబినేషన్‌లో మరో ప్రతిష్ఠాత్మక చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది.

కథ క్రీస్తుశకం 2209లోని భవిష్యత్‌ ప్రపంచం నేపథ్యంలో సాగనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే వెల్లడించారు. డిస్టోపియన్‌ ప్రపంచాన్ని నేపథ్యంగా చేసుకుని సైన్స్‌ ఫిక్షన్‌, యాక్షన్‌, అడ్వెంచర్‌ అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు. కథ, సుదీప్‌ పాత్రకు సంబంధించిన వివరాలను చిత్రబృందం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచింది. ఫస్ట్‌ లుక్‌తో సినిమా ప్రమోషన్‌కు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌ ప్రపంచం, భారీ యాక్షన్‌ సన్నివేశాలు, సుదీప్‌ మాస్‌ లుక్‌ కలిపి సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్