నేపాల్ : నేపాల్ లోని పలు నదులు ఇప్పటికే డేంజర్ మార్క్ ను దాటడంతో మళ్లీ వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేపాల్ దేశంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ముఖ్యంగా 3 ప్రధాన నదుల నీటిమట్టాలు డేంజర్ మార్క్ ను దాటాయి. నేపాల్ వరద అంచనా విభాగం అధికారుల వివరాల మేరకు ... బుధవారం ఉదయం 6 గంటల సమయంలో సున్ కోషి, బుధి గండకి, మహాకాళి నదులలో నీటి మట్టాలు హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. లామ్‌జంగ్ జిల్లాలోని మార్శ్యాంగ్డి నదిలో కూడా నీటి మట్టం మంగళవారం అర్ధరాత్రి డేంజర్ మార్క్ దాటింది. దీంతో మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ప్రజలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDRRMA) సూచించింది. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరంతర వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇక .... నేపాల్ లో పెనువిపత్తుగా ముంచెత్తిన వరదల కారణంగా ... బుధవారం నాటికి నేపాల్, టిబెట్‌లలో కలిపి మరణాల సంఖ్య 1,130కి పెరిగింది. ఇప్పటి వరకు 1,113 మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. చట్టపరమైన గుర్తింపు ప్రక్రియలు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. 95 మృతదేహాలను బంధువులకు అప్పగించామని తెలిపారు. గుర్తింపు లేని 911 మృతదేహాల వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశామన్నారు. ఇప్పటి వరకు 6,541 మందిని రక్షించగా, 4,858 మంది వరదల్లో గల్లంతయ్యారు. 7,912 మంది సిబ్బంది గాలింపు చర్యల్లో కొనసాగుతున్నారు.
Alert - నేపాల్ కు మళ్లీ వరద ముప్పు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 12:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)