బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చికిత్స పొందుతూ మహిళ మృతి

1 గంట క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 12:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కుటుంబానికి అండగా ఉంటాం

- టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్ర నాయుడు

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని 2050 హెల్త్‌కేర్ ఆసుపత్రిలో సుమారు రెండేళ్లుగా చికిత్స పొందుతున్న నేషనల్ ఉమెన్ రైట్స్ రాష్ట్ర ఉప అధ్యక్షురాలు ఎం. విజయ చెల్లెలు జయలక్ష్మి మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన బైరెడ్డిపల్లి మండలం గడ్డూరు గ్రామానికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. జయలక్ష్మి మృతి విషయం తెలుసుకున్న టీడీపీ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్ర నాయుడు గడ్డూరు గ్రామానికి చేరుకుని ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం కుటుంబ సభ్యులు సమర్పించిన దరఖాస్తుకు సంబంధించిన సహాయం త్వరగా విడుదలయ్యేలా తన వంతు కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం బైరెడ్డిపల్లి మండల పాత్రికేయుల బృందం టి.గడ్డూరు గ్రామానికి చేరుకుని జయలక్ష్మి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు. అలాగే పలమనేరు హ్యూమన్ రైట్స్ సంఘ నాయకులు కూడా హాజరై జయలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జయలక్ష్మికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు బెంగళూరులోని ఆసుపత్రిలో సుమారు రెండేళ్లుగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. చికిత్స, వైద్య ఖర్చుల కోసం ఇప్పటివరకు రూ.40 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న నగదు, ఆస్తులను సైతం వైద్య చికిత్స కోసం వినియోగించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందితే కుటుంబానికి కొంతమేర ఆర్థిక ఊరట లభించే అవకాశం ఉంటుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని త్వరగా అందించాలని వారు కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్