- శ్రవణ్ రెడ్డి
శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్ కేఆర్ సమర్పణలో, కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా హీరో శ్రవణ్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ‘‘‘డర్టీ హరి’కి పూర్తి భిన్నంగా ‘అగధ’లో నా పాత్ర ఉంటుంది. చాలా షేడ్స్ ఉన్న ఈ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. ఎంఎస్. రాజు గారి వంటి విజన్ ఉన్న ఫిల్మ్ మేకర్ మళ్లీ నాకు అవకాశం ఇవ్వడం చాలా లక్కీ అనిపిస్తుంది. ‘అగధ’ నాకు ఎంతో ఛాలెంజింగ్‌గా, డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. ఇందులో హారర్, థ్రిల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. ఏదైనా సరే కొత్తగా ఓ హుక్ పాయింట్ ఉండాలని ఎంఎస్. రాజు గారు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. నా పాత్ర గుడ్ వర్సెస్ బ్యాడ్, గాడ్ వర్సెస్ ఈవిల్ అన్నట్టుగా సాగుతుంది. ఎంఎస్. రాజు గారు చెప్పింది చెప్పినట్టుగా నటించేశాను. ఈ సెట్‌లో ఎంఎస్. రాజు గారిని చూస్తే చాలా కొత్తగా కనిపించారు. ఆయనకు సినిమా పట్ల ఉండే తాపత్రయం, డెడికేషన్‌ను నేను మ్యాచ్ చేయలేను. ఇలాంటి చిత్రాలకు కచ్చితంగా సీక్వెల్‌కు అవకాశం ఉంటుంది. మరి ఎంఎస్. రాజు గారు రెండో పార్ట్ ఎప్పుడు అంటారో చూడాలి’’ అని వివరించారు.








కామెంట్‌లు (0)