మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వాడుక నీటిని పూర్తిస్థాయిలో శుద్ధి చేసేలా చర్యలు చేపట్టాలి : కమిషనర్

47 నిమిషాల క్రితం

east
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 04:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : నగరంలోని వాడుక నీరుని పూర్తిస్థాయిలో శుద్ధి చేసేలా నగరపాలక సంస్థ చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి హుకుంపేటలో పర్యటించి.. 30MLD సీవేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ ను పరిశీలించారు. ప్లాంట్‌లోకి వచ్చే మురుగునీరు, శుద్ధి అయి బయటకు వెళ్లే నీరు యొక్క పీహెచ్ విలువలు, ఉష్ణోగ్రత మరియు రసాయన శాతాన్ని ప్రతిరోజూ రికార్డు చేయాలని సూచించారు. ప్లాంట్ యంత్రాలు దెబ్బతినకుండా ఉండటానికి ప్లాస్టిక్ కవర్లు, బట్టలు, రాళ్లు వంటి ఘన వ్యర్థాలను స్క్రీనింగ్ ద్వారా ముందే వేరు చేయాలన్నారు. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌ లను నశింపజేయడానికి చివరి దశలో క్లోరినేషన్ లేదా UV పద్ధతులను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్దేశించిన కాలుష్య నియంత్రణ ప్రమాణాల ప్రకారమే నీటిని శుద్ధి చేసి బయటకు వదలాలని స్పష్టం చేశారు. అలాగే ప్లాంట్‌లోని పంపులు, బ్లోయర్లు, విద్యుత్ మోటార్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని పేర్కొన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న 50.6 MLD ప్లాంట్ ను పరిశీలించారు. జరుగుతున్న పనులను వేగవంతం చేసి.. అక్టోబర్ లో ట్రైల్ రన్, డిసెంబర్ లో పూర్తి వినియోగంలోకి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. పర్యటనలో ఎస్ఈ రీటా, ఈఈ మదర్షా అలీ, డీఈ విరూపాక్ష, ఏఈ ప్రసాద్, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్