అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘లీసా’ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారతీయ తెరపై ఇప్పటివరకు రాని సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు జవహర్ పవార్, నిర్మాతలు వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల తెలిపారు. సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం ఉందని వారు పేర్కొన్నారు. ఓం సాయిరామ్ ఆర్ట్స్, ఐరాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో జవహర్ పవార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం కెమెరా బాధ్యతలతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చి, సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘ఎస్సార్ కళ్యాణమండపం’ దర్శకుడు శ్రీధర్ గాదె ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
శరవేగంగా ‘లీసా’ పోస్ట్ ప్రొడక్షన్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)