దుల్కర్ సల్మాన్ నటిస్తున్న భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ నుంచి రెండో సింగిల్ ‘లూజర్’ విడుదలైంది. జేక్స్ బిజోయ్ స్వరపరిచిన ఈ పాటను మలయాళంలో దుల్కర్ సల్మాన్ స్వయంగా ఆలపించగా, సుహైల్ కోయా సాహిత్యం అందించారు. మలయాళ వెర్షన్‌లో కె. బాలసరంగన్, జేక్స్ బిజోయ్ కూడా వోకల్ అందించారు. ఈ పాటను మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. తమిళ, తెలుగు వెర్షన్లను బెన్నీ దయాల్ ఆలపించగా, విఘ్నేష్ రామకృష్ణ, సనారే సాహిత్యం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఆడియో లాంచ్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం కేరళలోని కక్కనాడ కిన్‌ఫ్రా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది.
‘ఐయామ్ గేమ్’ నుంచి ‘లూజర్’ విడుదల
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 28, 2026, 08:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)