చెన్నై: నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మహాశక్తి’ చిత్ర టీజర్ విడుదలైంది. ‘రైజ్ ఆఫ్ మహాశక్తి’ పేరుతో వచ్చిన టీజర్‌లో నయనతార మరోసారి అమ్మోరు తల్లిగా శక్తిమంతమైన దైవిక పాత్రలో కనిపించారు. 2020లో వచ్చిన ‘అమ్మోరు తల్లి’కు ఇది సీక్వెల్. ఈసారి దర్శకుడు సుందర్ సి. సినిమాను తెరకెక్కిస్తున్నారు. టీజర్ పౌరాణిక నేపథ్యంలో ప్రారంభమవుతుంది. ఓ రాజ్యంపై శత్రువుల దాడి, యువరాజుకు ఎదురైన ప్రమాదం, అతడిని రక్షించేందుకు రాణి చేసే ప్రార్థన వంటి అంశాలతో కథ సాగుతుంది. ఆ తర్వాత నయనతార దైవశక్తిగా ప్రత్యక్షమై యువరాజును కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు టీజర్ సూచిస్తోంది. గత చిత్రంతో పోలిస్తే ఈ సీక్వెల్ మరింత భారీ స్థాయిలో పౌరాణిక, యాక్షన్ అంశాలతో రూపొందినట్లు తెలుస్తోంది. డాక్టర్ ఇషారి కె. గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెజీనా కాసాండ్రా, యోగిబాబు, ఊర్వశి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ‘మహాశక్తి’ నవంబర్ 6న దీపావళి సందర్భంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
నయనతార ‘మహాశక్తి’ టీజర్ విడుదల
36 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 11:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)