బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఇ.ఎం.ఐ’తో కొత్త టాలెంట్‌కు అవకాశం

1 గంట క్రితం

IMG_8069.jpg.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 06:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులతో 7 పి.ఎం. ప్రొడక్షన్స్‌ కొత్త చిత్రం ప్రారంభం

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్న 7 పి.ఎం. ప్రొడక్షన్స్‌ సంస్థ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహిస్తూ ‘ఇ.ఎం.ఐ’ పేరుతో పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తోంది. నిఖిల్‌ కువ్వరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో ‘లాల్‌ సలామ్‌’, ‘హాస్టల్‌ డేస్‌’ తదితర వెబ్‌ సిరీస్‌లతో గుర్తింపు పొందిన దరహాస్‌ హీరోగా పరిచయమవుతున్నారు. ‘లిటిల్‌ హార్ట్స్‌’ చిత్రంలో కీలక పాత్ర పోషించి ఫేమ్‌ అయిన శైలజ ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.

‘ఇ.ఎం.ఐ’ చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో ఆది సాయికుమార్‌ క్లాప్‌ ఇవ్వగా, దర్శకుడు సాయి మార్తాండ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ దర్శకుడు రాహుల్‌ శ్రీనివాస్‌ స్క్రిప్ట్‌ను అందజేశారు.

బైక్‌, కారు, ఖరీదైన ఫోన్‌ వంటి వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఈఎంఐలపై ఆధారపడటం నేటి యువతలో సాధారణంగా మారింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఈఎంఐ భారం ఒక సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈఎంఐలపై వస్తువులు కొనుగోలు చేసిన యువత వాటి వాయిదాలు చెల్లించేందుకు ఎదుర్కొనే ఇబ్బందులు, వారి జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాల చుట్టూ ఈ చిత్ర కథ సాగనుంది.

హార్ట్‌టచింగ్‌ ఎమోషన్స్‌తో పాటు పూర్తి స్థాయి వినోదాన్ని మేళవించి సినిమాను తెరకెక్కించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. సినిమాలోని ప్రతి సన్నివేశం యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని పేర్కొంది. పక్కా ప్రణాళికతో చిత్ర నిర్మాణం చేపట్టి, భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ‘ఇ.ఎం.ఐ’ చిత్రంతో పాటు ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ దర్శకుడు రాహుల్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో 7 పి.ఎం. ప్రొడక్షన్స్‌ సంస్థ మరో భారీ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు సంస్థ తెలిపింది. మంచి కాన్సెప్ట్‌లతో వరుసగా చిత్రాలను నిర్మించేందుకు 7 పి.ఎం. ప్రొడక్షన్స్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్