మంగళవారం, 15 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి నిధులు విడుదల చేయాలి

1 గంట క్రితం

markapuram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 12:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

డీఈఓ మార్కాపురం వారికి ఏపీటీఎఫ్ వినతి

ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం జిల్లాలోని జడ్పీహెచ్‌ఎస్ హై స్కూల్ ప్లస్ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2025 జనవరి నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) మార్కాపురం జిల్లా శాఖ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఏపీటీఎఫ్ మార్కాపురం జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ నాయబ్ రసూల్, కె మల్లికార్జున రావు, నాయకులు డి సుబ్బరాయుడు, షేక్ హమ్మద్ డీఈఓ మార్కాపురం వారికి వినతిపత్రం అందజేశారు. 2025 జనవరి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు బిల్లులు, నిధులు అందకపోవడంతో పాఠశాలల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకం సక్రమంగా అమలు కావాలంటే, బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. నిధులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని ఏపీటీఎఫ్ నాయకులు డీఈఓను కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్