శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రతినాయికగా రెజీనా!

1 గంట క్రితం

film
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 08:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నయనతార నటిస్తున్న ‘మూకుతి అమ్మన్‌ 2’లో రెజీనా కసాండ్రా ప్రతినాయికగా నటిస్తున్నట్లు సమాచారం. తొలి భాగానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా, రెండో భాగాన్ని నటుడు, దర్శకుడు సుందర్‌ సి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనాను ఇప్పటివరకు చూడని సరికొత్త లుక్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. డాక్టర్‌ ఇషారి కె. గణేష్‌ వెల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఫాంటసీ అంశాలు, యాక్షన్‌ సన్నివేశాలను మరింత భారీగా ఉండేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్