శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రవితేజతో వివేక్‌ ఆత్రేయ కొత్త చిత్రం

13 గంటల క్రితం

raviteja.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 08:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘ఇరుముడి’తో విజయాన్ని అందుకున్న రవితేజ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ‘సరిపోదా శనివారం’తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న దర్శకుడు వివేక్‌ ఆత్రేయతో ఆయన జతకట్టనున్నారు. ‘ఇరుముడి’ విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక వేడుకలో వివేక్‌ ఆత్రేయ, నిర్మాతలు లక్ష్మణ్‌, శ్రీని రవితేజను కలిసి అభినందించారు. రవితేజ, వివేక్‌ ఆత్రేయ, లక్ష్మణ్‌, శ్రీని, బ్రిడ్జ్‌ ప్రొడక్షన్స్‌ కాంబినేషన్‌లో ఈ కొత్త చిత్రం తెరకెక్కనుంది. దర్శకుడు హసిత్‌ గోలి, రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్‌ త్వరలో వెల్లడించనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్