శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆ వీరులే 'రణబాలి'కి స్ఫూర్తి

1 గంట క్రితం

ఆ వీరులే 'రణబాలి'కి స్ఫూర్తి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 07:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాయలసీమ వీరులు బుడ్డా వెంగళ్‌రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గడేకల్‌ బొబ్బిలి నాగిరెడ్డిల స్ఫూర్తితోనే 'రణబాలి' పాత్రను రూపొందించినట్లు దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌ వెల్లడించారు. ఈ విషయాన్ని వివరిస్తూ చిత్రబృందం విడుదల చేసిన మూడో డాక్యుమెంటరీ 'ది మెన్‌ వుయ్‌ ఫర్గాట్‌'లో ఆయన పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. ఈ ముగ్గురు వీరుల కథలు ఇప్పటికీ రాయలసీమలో జానపద గీతాల రూపంలో ప్రచారంలో ఉన్నాయని తెలిపారు. విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం ప్రచారంలో భాగంగా కథకు సంబంధించిన విశేషాలను నాలుగు డాక్యుమెంటరీల రూపంలో ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడుదల కాగా, తాజాగా మూడో డాక్యుమెంటరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చిత్రం అక్టోబర్‌ 16న దసరా సందర్భంగా విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్