కిన్షాసా: కాంగో నదిలో రెండు పడవలు ఢీకొన్న ఘటనలో కనీసం 30 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. ఈ ఘటన ఈక్వటేర్ ప్రావిన్స్‌లోని న్గోంబే-లుకోలెలా ప్రాంతం సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఉబాంగి నుంచి రాజధాని కిన్షాసాకు వెళ్తున్న పడవ, కిన్షాసా నుంచి లుకోలెలాకు వెళ్తున్న మరో పడవను ఢీకొట్టింది. ఢీకొన్న అనంతరం ఒక పడవ పూర్తిగా నీటిలో మునిగిపోయినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిగా పలువురి ఆచూకి గల్లంతైంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కాంగోలో పడవ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. రాత్రివేళ ప్రయాణాలు, పడవల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించడం, భద్రతా ప్రమాణాల లోపం, మౌలిక సదుపాయాల కొరతే ఇందుకు ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. గత జూలైలో కాసాయి ప్రావిన్స్‌లో విద్యార్థులతో వెళ్తున్న చెక్క పడవ మునిగిన ఘటనలో కనీసం 20 మంది మృతి చెందారు.







కామెంట్‌లు (0)