సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిజినెస్‌ రియాలిటీ షో హోస్ట్‌గా మాధవన్‌

58 నిమిషాల క్రితం

madhavan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 04:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దుబాయ్‌ : నటుడు మాధవన్‌ బిజినెస్‌ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ‘ది గేమ్‌ ఛేంజర్స్‌: మిడిల్‌ ఈస్ట్‌’ కార్యక్రమానికి ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్న ఆప్టిమిస్టిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా సంస్థ సోమవారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ షోలో వివిధ దేశాలకు చెందిన స్టార్టప్‌ ఫౌండర్లు కంటెస్టెంట్లుగా పాల్గొని, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ప్యానల్‌ ముందు తమ వ్యాపార ఆలోచనలను వివరిస్తారు. ప్రస్తుతం దుబాయ్‌ కేంద్రంగా ఈ షోను నిర్వహించనున్నారు. అనంతరం ఇతర ప్రాంతాలకు విస్తరించే ఆలోచన ఉందని నిర్మాణ సంస్థ తెలిపింది. త్వరలోనే చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మాధవన్‌ ‘ధురంధర్‌’, ‘జి.డి.ఎన్‌’ చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్