- బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్
ఢాకా: మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి విడుదల చేసి తమకు అప్పగించకపోతే భారత్‌లో పర్యటించబోనని బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ తెలిపారు. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనాను వీలైనంత త్వరగా తమకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. 2024లో బంగ్లాదేశ్‌లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల అనంతరం షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు. అనంతరం బంగ్లాదేశ్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. భారత్‌లో ఉంటూ హసీనా మీడియాతో చేస్తున్న వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చర్చలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ పేర్కొంది. హసీనాను అప్పగించాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనను పరిశీలిస్తున్నామని భారత్ తన వైఖరిని వెల్లడించింది.







కామెంట్‌లు (0)