ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

డాల్ఫిన్‌ టైపూన్‌తో షాంఘైలో 1300కి పైగా విమానాలు రద్దు

1 గంట క్రితం

Shanghai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 12:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బీజింగ్‌ : చైనాపై డాల్ఫిన్‌ టైపూన్‌ విరుచుకుపడనుంది. షాంఘైలోని రెండు విమానాశ్రయాలు 1300కి పైగా విమానాలను రద్దు చేశాయి. సుమారు మూడు లక్ష‍లమందిని సురక్ష‍ిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. షాంఘైలోని హాంగ్‌కియావో, పుడాంగ్ విమానాశ్రయాలు కూడా ఆదివారం నాటి విమానాలలో సుమారు 60శాతం రద్దు చేశాయని స్థానిక మీడియా తెలిపింది. ఇది ఆదివారం సాయంత్రం డాల్ఫిన్‌ టైపూన్‌ జెజియాంగ్ ప్రావిన్స్, పొరుగున ఉన్న ఫుజియాన్ ప్రావిన్స్‌లోని ఉత్తర భాగాలను తాకుతుందని అంచనా. గంటకు సుమారు 162 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో పాటు తీవ్రమైన వరదలు, జెజియాంగ్‌లో కొండచరియలు విరిగి పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

కొన్ని ప్రాంతాలలో 200-400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చైనాలోని వాతావరణ నిపుణులు తెలిపారు. శనివారం సాయంత్రం, జెజియాంగ్‌లోని తైజౌ నగరంలో అధికారులు సుమారు 3,90,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. షాంఘైలోని అధికారులు ప్రమాదకర ప్రాంతాల నుండి 30,000 మందికి పైగా ప్రజలను తరలించారు. ఫెర్రీలు, భారీ నౌకలు సహా అన్ని జల రవాణా సంబంధిత కార్యకలాపాలను నిలిపిసినట్లు జెజియాంగ్‌ అధికారులు తెలిపారు.

ఈ టైపూన్‌తో తైవాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుండి తైపీతో సహా ఉత్తర తైవాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తైవాన్‌ కూడా చైనాకు తమ విమానాలను రద్దు చేసినట్లు పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్