దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 18న సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, నెలాఖరు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ జరగనుంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో మల్టీస్టారర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అనిల్ రావిపూడికి దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘పటాస్’ ఘనవిజయం సాధించింది. అలాగే వెంకటేష్‌తో చేసిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు కూడా విజయవంతమయ్యాయి. ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లను ఒకే చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. మరో కథానాయిక ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. 2027 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
18న అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రారంభం!
09 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 09, 2026, 08:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)