mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అల్లు అర్జున్‌ 23వ సినిమాకు సన్నాహాలు

2 గంటల క్రితం

allu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 10:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అల్లు అర్జున్‌ తన 23వ సినిమాకు సన్నాహాలు ప్రారంభించారు. దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌తో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన లుక్‌ టెస్ట్‌, ప్రీ ప్రొడక్షన్‌ పనులు ముంబైలో జరుగుతున్నాయి. ప్రస్తుతం ‘రాకా’ చిత్రీకరణకు విరామం రావడంతో అల్లు అర్జున్‌ ఈ పనులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ‘రాకా’కు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తుండగా, సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో సాగుతోంది. 23వ చిత్రంలో అల్లు అర్జున్‌ కొత్త గెటప్‌లో కనిపించనున్నారు. పాత్రకు సంబంధించిన లుక్‌ను ఖరారు చేసే పనిలో చిత్రబృందం నిమగ్నమైంది. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్