మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభారీగా పెరగనున్న కాస్మోటిక్స్‌ ధరలు

58 నిమిషాల క్రితం

products
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 11:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ :భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిసరుకుల ధరల పెరుగుదలను సాకుగా చూపుతూ భారీగా ధరలను పెంచేందుకు కాస్మోటిక్స్‌ ‌కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ముడిసరుకులపై వ్యయం పెరగడంతో రానున్న రోజుల్లో ధరలను మరింత పెంచనున్నట్లు దిగ్గజ ఎఫ్‌ఎంసిజి కంపెనీ హిందుస్థాన్ యునిలివర్ (హెచ్‌‌యుఎల్‌) ప్రకటించింది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటి ఇతర దిగ్గజ కంపెనీల బాటలోనే హెచ్‌యూఎల్ కూడా నడుస్తూ పెరిగిన ఉత్పత్తి వ్యయ భారాన్ని వినియోగదారులపైకి మోపేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. డవ్, సర్ఫ్ ఎక్సెల్, పియర్స్, పెప్సోడెంట్ వంటి ప్రముఖ బ్రాండ్లను విక్రయించే హెచ్‌యుఎల్.. జూన్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణ ప్రభావంలో కేవలం సగం భారాన్ని మాత్రమే వినియోగదారులపైకి మళ్లించామని తెలిపింది. రానున్న రోజుల్లో ధరల విషయంలో మరికొన్ని తగిన చర్యలు తీసుకుంటామని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా వెల్లడించారు. ఈ త్రైమాసికంలో కంపెనీ సుమారు 5 శాతం మేర ధరలను పెంచగా, అమ్మకాల పరిమాణం కూడా 5 శాతం పెరిగింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్