మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబియ్యం ఎగుమతుల్లో 5 శాతం వృద్ధి

51 నిమిషాల క్రితం

rice exports
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 10:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : దేశంలో బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ధాన్యం ఎగుమతులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బాస్మతియేతర బియ్యానికి విదేశాల నుంచి వస్తున్న డిమాండ్ కారణంగా 2026 ప్రథమార్థం (జనవరి నుంచి జూన్‌)లో బియ్యం ఎగుమతులు 5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 40 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్న భారత్.. థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్థాన్ వంటి ఇతర ప్రధాన సరఫరాదారుల కంటే అధిక మొత్తంలో విదేశాలకు ధాన్యాన్ని తరలిస్తోన్నాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం పశ్చిమాసియా మార్కెట్లపై పడటంతో బాస్మతి బియ్యం ఎగుమతులు 5.5 శాతానికి పడిపోయాయి. అయితే ఆఫ్రికా దేశాల నుంచి నాన్ బాస్మతి బియ్యానికి డిమాండ్ ఏకంగా 9.6 శాతం పెరగడంతో బాస్మతి తగ్గుదల భర్తీ అయింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్