బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

FIFA: ఫైనల్స్ షెడ్యూల్ ఇదే!

3 గంటల క్రితం

fifa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 07:49 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూజెర్సీ: ఫీఫా ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. రౌండ్ ఆఫ్-16 ముగింపు దశకు చేరుకోగా, ఇప్పుడు అభిమానుల దృష్టి క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ప్రతిష్టాత్మక ఫైనల్‌పై నిలిచింది. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీకి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జూలై 20న (భారత కాలమానం ప్రకారం ఉదయం 12.30 గంటలకు) న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరగనుంది.

ఆశ్చర్యపరిచిన ఫలితాలు

ఈ ప్రపంచకప్‌లో పలువురు ఫేవరెట్ జట్లు అనూహ్యంగా నిష్క్రమించాయి. జర్మనీని పరాగ్వే పెనాల్టీ షూటౌట్‌లో ఓడించి చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ చరిత్రలో జర్మనీ తొలిసారి పెనాల్టీ షూటౌట్‌లో ఓటమి చవిచూడగా, వరుసగా నాలుగు షూటౌట్ విజయాల పరంపరకు తెరపడింది. మరోవైపు 24 ఏళ్లుగా టైటిల్ కోసం ఎదురుచూస్తున్న బ్రెజిల్ ఆశలకు నార్వే గండి కొట్టింది. నెదర్లాండ్స్‌ను మొరాకో ఓడించి డచ్ జట్టును టోర్నీ నుంచి ముందుగానే ఇంటిముఖం పట్టించింది. తొలి ప్రపంచకప్ ఆడుతున్న కేప్ వెర్డే తన పోరాట పటిమతో అభిమానుల ప్రశంసలు అందుకుంది.

టైటిల్‌కు ఇక మూడు అడుగులు

జూలై 8తో రౌండ్ ఆఫ్-16 ముగియనుండగా, క్వార్టర్ ఫైనల్స్‌లో గెలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. అక్కడ విజయం సాధించిన రెండు జట్లు జూలై 20న జరిగే ఫైనల్లో ప్రపంచకప్ ట్రోఫీ కోసం తలపడనున్నాయి.


భారత కాలమానం ప్రకారం క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్

మ్యాచ్

తేదీ

సమయం (IST)

మొరాకో × ఫ్రాన్స్

జూలై 10

ఉదయం 1:30

స్పెయిన్ × బెల్జియం

జూలై 11

ఉదయం 12:30

నార్వే × ఇంగ్లాండ్

జూలై 12

ఉదయం 2:30

అర్జెంటీనా × స్విట్జర్లాండ్

జూలై 12

ఉదయం 6:30

సెమీఫైనల్స్ షెడ్యూల్

మ్యాచ్

తేదీ

సమయం (IST)

Q1 విజేత × Q2 విజేత

జూలై 15

ఉదయం 5:30

Q3 విజేత × Q4 విజేత

జూలై 16

ఉదయం 5:30

ఫైనల్

మ్యాచ్

తేదీ

సమయం (IST)

S1 విజేత × S2 విజేత

జూలై 20

ఉదయం 12:30

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్