ప్రజాశక్తి - మైదుకూరు : విద్యుత్ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు మరణించిన విషాద ఘటన వైఎస్‌ఆర్ కడప జిల్లా మైదుకూరు పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...మైదుకూరు పట్టణం ఆకుల వీధిలో దంపతులు సుబ్బరాయుడు (85), ఓబులమ్మ (75) నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి తమ ఇంటి ఆరు బయట నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున వీరు ఇంటి సమీపం నుంచి వరి పొట్టుతో వెళ్తున్న లారీకి విద్యుత్ తీగలు తగులుకోవడంతో స్తంభం విరిగి దంపతులపై పడింది. దీంతో వారివురూ అక్కడికక్కడే మరణించారు. విద్యుత్ స్తంభం పాతబడిందని, తొలగించి నూతనంగా ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. సంఘటనా స్థలాన్ని ట్రాన్స్ కో డిఇ లక్ష్మిపతి, ఎడి శ్రీకాంత్, ఎఇ రామబద్రయ్య పరిశీలించారు. లారీకి విద్యుత్ వైర్ తో పాటు డిష్ కేబుల్ వైరు తగులుకోవడంతో స్తంభం విరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Print Editionవిద్యుత్ స్తంభం విరిగిపడి దంపతులు మృతి
08 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 08, 2026, 10:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)