క్యూ1లో రూ.13,349 కోట్ల నికర లాభాలు
ముంబయి : దేశంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) తన ఇన్వెస్టర్లకు ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకోసం జులై 15వ తేదీని రికార్డు తేదీగా కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఈ డివిడెండ్ మొత్తాన్ని జులై31లోపు అర్హులైన షేర్ హోల్డర్ల ఖాతాల్లో జమ చేయనున్నట్లు టిసిఎస్ పేర్కొంది. ఈ తాజా ప్రకటనతో కలిపి ఈ ఏడాదిలో కంపెనీ షేర్‌కు చెల్లిస్తున్న డివిడెండ్ మొత్తం రూ.100కు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో కంపెనీ నికర లాభం 5 శాతం పెరిగి రూ.13,349 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ. 12,760 కోట్లుగా నమోదయ్యింది. అదేవిధంగా కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం గతేడాది రూ. 63,437 కోట్ల నుంచి సుమారు 14 శాతం పెరిగి రూ.72,275 కోట్లకు పెరిగింది. గురువారం బిఎస్‌ఇలో టిసిఎస్ షేర్ 0.52 శాతం తగ్గి రూ.2047.75 వద్ద ముగిసింది.







కామెంట్‌లు (0)