ప్రజాశక్తి-అమరావతి : దళిత మహిళ గంగమ్మ అనుమానాస్పద మృతిపై ఆమె కుమార్తె లక్ష్మి ఫిర్యాదు మేరకు నమోదైన కేసు తదుపరి దర్యాప్తు వివరాలను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వా న్ని గురువారం ఆదేశించింది. గంగమ్మ కుమా రుడు వీరేంద్ర అదృశ్యం కేసు దర్యాప్తు పురోగతిపైనా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని పేర్కొంది. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తామని, కేసును పెండింగ్‌లో కొనసాగిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌ల ధర్మాసనం పేర్కొంటూ విచారణ ను వాయిదా వేసింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాల్ కు చెందిన గంగమ్మ లాకప్‌డెత్‌కు గురైందని, కీలకసాక్షి దర్గప్ప పోలీసుల హింసకు గురయ్యారని ఆరోపణలున్నాయి. దర్గప్ప ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ఆయన వాగ్మూలాన్ని వెంటనే నమోదు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది సింగమనేని ప్రణతి స్పందిస్తూ, గత ఆదేశాల మేరకు గంగమ్మ మృతిపై నమోదైన కేసులో స్టేటస్ రిపోర్టు దాఖలు చేశామని, వీరేంద్ర అదృశ్యం కేసులో ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉందని తెలిపారు.
Print Editionసీల్డ్ కవర్‌లో గంగమ్మ కేసు దర్యాప్తు వివరాలు : హైకోర్టు ఆదేశం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 10, 2026, 12:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)