గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సుప్రీంను ఆశ్రయించిన సిట్.. నాగరాజు కస్టడీ విచారణకు బ్రేక్

2 గంటల క్రితం

థర్డ్ డిగ్రీ వాడకుండా ఆదేశాలివ్వండి : కోర్టుకు సిఐ నాగరాజు అభ్యర్థన
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 12:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- విజయవాడ : లాకప్ డెత్ కు గురైన గాదె సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజు కస్టడీ విచారణపై సుప్రీంకోర్టును సిట్ ఆశ్రయించింది. దీంతో, గురువారం నుండి ఎనిమిది రోజులపాటు జరగాల్సిన సిఐ నాగరాజు కస్టడీ విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. నాగరాజును ఎనిమిది రోజులపాటు సిట్ తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించిన రాష్ట్ర హైకోర్టు... కొన్ని షరతులు విధించింది. విచారణలో పారదర్శకతకు ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని, నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ఒక రోజు కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లోనూ, మిగిలిన రోజులు రాజమండ్రి జైలులోనూ నాగరాజును విచారించాలని సూచించింది. విచారణకు సంబంధించిన అంశాలు, సాక్ష్యాల సేకరణ, నిందితుడిని ప్రశ్నించే విధానంపై హైకోర్టు ఆదేశాలు తమ దర్యాప్తు పరిధిని ప్రభావితం చేస్తాయంటూ సుప్రీంకోర్టులో సిట్‌ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సిఐ నాగరాజు విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్