సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా పరిచయం అవుతున్నారు. వీరేష్ కోకా దర్శకత్వంలో సురవి విజన్స్ బ్యానర్‌పై పి. చక్రధర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దివ్యాని మొండల్ కథానాయికగా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు డాలీ క్లాప్ కొట్టగా, గంటా రవితేజ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నల్లమలుపు బుజ్జి స్క్రిప్ట్ అందించారు. ఈ నెల 29 నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, "275కు పైగా సినిమాలకు పని చేశాను. ప్రేక్షకులు నాకు ఎంతో ప్రేమ, అభిమానాన్ని అందించారు. ఇప్పుడు మా అబ్బాయి హీరోగా పరిచయం అవుతున్నాడు. అదే ప్రేమ, అభిమానాన్ని తనపైనా చూపిస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు. సుస్వర తరంగ్ మాట్లాడుతూ, "నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతతో పాటు చిత్రబృందంలోని అందరికీ ధన్యవాదాలు" అని చెప్పారు. దర్శకుడు వీరేష్ కోకా మాట్లాడుతూ, "ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్" అని తెలిపారు.
వందేమాతరం శ్రీనివాస్ తనయుడు హీరోగా...
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 26, 2026, 10:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)